అర్జున్ రెడ్డి హీరోయిన్ కు కలిసొస్తుందా ?

Published on Nov 26,2019 11:16 AM

అర్జున్ రెడ్డి చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన భామ షాలిని పాండే. అర్జున్ రెడ్డి చిత్రంలో నటించిన విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయిపోయాడు కానీ అదే సినిమాలో హీరోయిన్ గా నటించి శృంగార సన్నివేశాలలో కూడా జీవించిన షాలిని పాండే కు మాత్రం స్టార్ డం దక్కలేదు సరికదా కనీసం మంచి పాత్రలు కూడా లభించలేదు దాంతో చిన్న చిన్న పాత్రల్లో నటించింది అలాగే చైనా చిత్రాల్లో నటించింది.

కట్ చేస్తే తాజాగా అనుష్క ప్రధాన పాత్రలో నటించిన '' నిశ్శబ్దం '' చిత్రంలో నటించింది షాలిని పాండే. ఈ చిత్రంలో సోనాలి అనే పాత్రలో నటిస్తోంది. నిశ్శబ్దం చిత్రంలోని షాలిని పాండే పాత్ర ని నిన్న రివీల్ చేసారు దర్శక నిర్మాతలు. అయితే షాలిని పాండే కు కనీసం ఈ సినిమా అయినా కలిసి వస్తుందా ? సాలిడ్ హిట్ నిస్తుందా ? స్టార్ డం తెచ్చి పెడుతుందా ? ఇన్ని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు అలాగే నటన పరంగా థియేటర్ ఆర్టిస్ట్ కూడా అయినప్పటికీ ఈ భామకు అంతగా అదృష్టం కలిసి రాలేదు , మరి ఈ సినిమా తర్వాత అయినా కలిసి వస్తుందా చూడాలి.