కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే సినిమానా ?

Published on Nov 22,2019 23:08 PM

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓ కుదుపు కుదిపేసింది ఆ సంఘటన అయితే అలాంటి సంఘటన ఆధారంగా సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ ఓ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నాడట. అంటే ఇంటర్ స్టూడెంట్స్ సూసైడ్ అంశాన్ని లేవనెత్తడం అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సినిమా చేయడమే.

అలాగే చేస్తారా ? లేక ఈ అంశంలో ఇతర సంస్థని దోషిగా చూపెట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని టచ్ చేయకుండా సినిమా చేస్తారా ? అన్నది తేలాల్సి ఉంది. సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ హీరోగా ఆంధ్రా పోరి లాంటి సినిమాని తీసిన రాజ్ మదిరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ అంశం వెండితెర మీద ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అయితే కేసీఆర్ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేస్తారా ? లేక మరో సంస్థ ని టార్గెట్ చేస్తారా చూడాలి.