విజయ్ దేవరకొండ హీరో సినిమా ఆగిపోయింద

Published on Feb 25,2020 10:40 AM

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై అనే తమిళ దర్శకుడి దర్శకత్వంలో హీరో అనే చిత్రం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్లు వినబడుతోంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై 50 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెలుగు , తమిళ భాషలలో ద్విభాషా చిత్రంగా రూపొందించాలని భావించారు. ఆ మేరకు సినిమా స్టార్ట్ అయ్యింది కూడా. ఇక రెండో షెడ్యూల్ స్టార్ట్ కావాల్సి ఉండే కానీ అది వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండటంతో డౌట్ వస్తోంది.

కట్ చేస్తే హీరో చిత్రాన్ని పక్కన పెట్టి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే చిత్రం చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఎంతసేపు ఫైటర్ గురించి మాత్రమే సమాచారం ఇస్తున్నాడు విజయ్ దేవరకొండ కానీ హీరో సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించడమే లేదు. దాంతో ఈ అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. ఇక తాజాగా ఫిలిం నగర్ లో వినబడుతున్న కథనం ప్రకారం హీరో సినిమా ఆగిపోయినట్లే అని అంటున్నారు.