ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్

Published on Dec 09,2019 11:22 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన పేరున చారిటబుల్ ట్రస్ట్ ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటివరకు కొన్ని గోప్యాంగా సేవా కార్యక్రమాలు చేసాడు కానీ ఇకపై తన చారిటబుల్ ట్రస్ట్ పై పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట. ఈమేరకు ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ కు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ వస్తుంది.

చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఉభయ కుశలోపరి గా వ్యవహరించ వచ్చని తెలుస్తోంది. దీనివల్ల అభాగ్యులను ఆదుకోవచ్చు అలాగే టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది అందుకే పలువురు సెలబ్రిటీలు చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేస్తుంటారు. ఇక ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి పెద్ద మొత్తంలో సేవా కార్యక్రమాలు చేపట్టవచ్హు అన్నమాట.