త్రివిక్రమ్ లవ్ స్టోరీ ఏంటో తెలుసా ?

Published on Mar 13,2020 21:20 PM
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీ పక్కాగా తెలుగు సినిమాని తలపించేలా ఉంటుంది తెలుసా ....... అసలు విషయంలోకి వెళితే ........ దర్శకుడు త్రివిక్రమ్ పెళ్లి చూపుల కోసం ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు ని చూడటానికి వెళ్ళాడట. అయితే అక్కడ పెళ్లిచూపులు సమయంలో చూడటానికి వెళ్ళింది ఇప్పుడు చేసుకున్న సౌజన్యని కాదు సుమా ! వాళ్ళ అక్కని. అయితే ఆమెకు బదులుగా ఆమె చెల్లెలు ని చూసి బాగా నచ్చడంతో నాకు వాళ్ళ చెల్లి నచ్చిందని అందరి ముందు చెప్పాడట.

దాంతో షాక్ అవ్వడం అందరి వంతు అయ్యింది. అక్క ని చూడటానికి వచ్చినవాడు చెల్లిని చేసుకుంటానని అనడంతో అవాక్కయ్యారు కానీ త్రివిక్రమ్ మంచి వాడు పైగా సౌజన్య నచ్చిందని చెప్పాడు కాబట్టి అతడికి ఇచ్చి చేయడమే మంచిదని నిర్ణయించారట. దాంతో పెద్దల అంగీకారంతో త్రివిక్రమ్ - సౌజన్యల పెళ్లి అయ్యింది. ఆ ఇద్దరికీ ఓ ఇద్దరు పిల్లలు కూడా. ఇటీవలే అల .... వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు త్రివిక్రమ్.