లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 15 న వస్తోందా ?

Published on Feb 28,2019 14:15 PM

ఎన్టీఆర్ బయోపిక్ కు వ్యతిరేకంగా వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ . ఇప్పటికే టీజర్ , ట్రైలర్ , వీడియో సాంగ్ లతో సంచలనం సృష్టించిన వర్మ మార్చి 15 న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడట . దాదాపుగా షూటింగ్ పార్ట్ అంతా పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . 

అయితే ఈ సినిమాని రిలీజ్ కాకుండా కొంతమంది అడ్డుకుంటున్నట్లు , బేరం పెడుతున్నట్లు రకరకాల వార్తలు వస్తున్నాయి దాంతో ఈ సినిమా రిలీజ్ పై అనుమానాలు నెలకొన్నాయి . ఒకటి రెండు రోజుల్లోనే వర్మ ఈ సినిమా విడుదల పై ఓ ప్రకటన విడుదల చేయనున్నాడట . దాంతో తెలిసిపోనుంది లక్ష్మీస్ ఎన్టీఆర్ పరిస్థితి . ఈ సినిమా కనుక విడుదల ఐతే పెద్ద వివాదాన్ని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది .