మహేష్ రిజెక్ట్ చేస్తే యష్ యాక్సెప్ట్ చేశాడా ?

Published on Jul 31,2019 13:21 PM

మహేష్ బాబు తో జనగణమన అనే చిత్రాన్ని చేయాలనీ పూరి జగన్నాధ్ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు కానీ మహేష్ బాబు మాత్రం పూరి జగన్నాధ్ కు ఛాన్స్ ఇవ్వడం లేదు దాంతో మహేష్ బాబు తో కాకుండా కన్నడ స్టార్ హీరో యష్ తో జనగణమన చిత్రాన్ని భారీ లెవల్లో చేయాలనీ చూస్తున్నాడట పూరి . 

అయితే యష్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రంతో బిజీ గా ఉన్నాడు , అయినా పూరి కి యష్ అంత తొందరగా ఛాన్స్ ఇస్తాడా ? అన్నది ప్రశ్నగా మారింది . యష్ కు కేజీఎఫ్ చిత్రంతో తిరుగులేని స్టార్ డం వచ్చింది దాంతో యష్ అయితే జనగణమన బాగుంటుందని భావిస్తున్నాడట పూరి జగన్నాధ్ . ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ హిట్ కొట్టాడు దాంతో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు పూరి .