గీత గోవిందం డైరెక్టర్ తో మహేష్ బాబు

Published on May 08,2019 15:30 PM

గీత గోవిందం చిత్రంతో సంచలన విజయం సాధించిన పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబు తో చేయడానికి సిద్ధం అవుతున్నాడు . ఇన్నాళ్లు చిన్న హీరోలు , మీడియం రేంజ్ హీరోలతో సినిమా చేశా ఇకపై స్టార్ హీరోలతోనే సినిమా చేస్తా అంటూ పట్టుబట్టి మరీ మహేష్ బాబు కు కథ వినిపించాడట ! ఔట్ లైన్ విన్న మహేష్ బాగుంది కానీ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తే తప్పకుండా చేద్దామని చెప్పాడట దాంతో ఆ పనిలో ఉన్నాడు దర్శకులు పరశురామ్ . 

గత ఏడాది విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న జంటగా గీత గోవిందం చిత్రం చేసాడు పరశురామ్ . చిన్న చిత్రంగా వచ్చిన గీత గోవిందం సంచలన విజయం సాధించింది . పెద్దగా కథ లేకపోయినా కథనం ఆకట్టుకునేలా ఉండటం దానికి తోడు విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ల నటన తోడవ్వడంతో సూపర్ హిట్ అయ్యింది . ఇంకేముంది పరశురామ్ వెంట పెద్ద క్యూ పడింది అయితే పరశురామ్ మాత్రం మహేష్ బాబు లేదా మరో స్టార్ హీరో తోనే సినిమా చేస్తానని భీష్మించుకు కూర్చున్నాడు.