బిగ్ బాస్ 4 సీజన్ కు మహేష్ బాబు ?

Published on Mar 13,2020 21:42 PM
బిగ్ బాస్ 4 సీజన్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , మలయాళం అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యింది బిగ్ బాస్ షో. తెలుగులో మొదటిసారి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి శభాష్ అనిపించగా రెండో సీజన్ కు హీరో నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ కు సీనియర్ హీరో నాగార్జున మరింతగా రక్తికట్టించి పీక్స్ కి తీసుకెళ్లాడు.

కట్ చేస్తే త్వరలోనే బిగ్ బాస్ 4 స్టార్ట్ కాబోతోంది దాంతో ఆ సీజన్ కు మహేష్ బాబు అయితే బాగుంటుందని కలిసారుట. భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసారట. అయితే మహేష్ బాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ చర్చలు సాగుతున్నాయి కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటాడన్న నమ్మకంతో ఉన్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. వెండితెర తో పాటుగా బుల్లితెర కూడా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో మహేష్ బాబు బిగ్ బాస్ 4 సీజన్ కు పచ్చజెండా ఊపడం ఖాయమని తెలుస్తోంది.