రెడ్డి గారి అబ్బాయి గా మహేష్ ?

Published on May 18,2019 12:16 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తాజా చిత్రానికి '' రెడ్డి గారి అబ్బాయి '' అనే టైటిల్ ని పరిశీలుస్తున్నటు తెలుస్తోంది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ . కాగా ఆ చిత్రానికి రెడ్డి గారి అబ్బాయి అనే టైటిల్ పెట్టడానికి ఆలోచన చేస్తున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి . ఈ దర్శకుడు చేసిన సినిమాలన్నీ హిట్ అందునా వినోదానికి పెద్ద పీట వేస్తాడు కూడా . దాంతో ఈ టైటిల్ ని పరిశీలిస్తున్నారట . 

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం కాబట్టి ఈ టైటిల్ యాప్ట్ అని భావిస్తున్నారు . అలాగే ఈ టైటిల్ తో పాటుగా మరో టైటిల్ కూడా వినబడుతోంది ''సరిలేరు నీకెవ్వరూ ''అని . అయితే కథ రీత్యా రెడ్డి గారి అబ్బాయి అయితే కరెక్ట్ అని అనుకుంటున్నారట . వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది .