ఏప్రిల్ లో నితిన్ పెళ్లి ?

Published on Jan 16,2020 16:20 PM
యంగ్ హీరో నితిన్ పెళ్లి ఏప్రిల్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది. షాలిని అనే యువతిని నాలుగేళ్లుగా  ప్రేమిస్తున్నాడు హీరో నితిన్. ఇద్దరూ డీప్ లవ్ లో ఉండటంతో వాళ్ళ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇరు కుటుంబాల పెద్దలు. దాంతో పెళ్లి ఈ వేసవిలో అది కూడా దుబాయ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి సిద్ధమయ్యారు నితిన్ - షాలిని. ఇప్పటికే దుబాయ్ లోని ప్రముఖ హోటల్ ని మొత్తం బుక్ చేశారట ఏప్రిల్ లో పెళ్లి కోసం. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఇష్టం పెరిగిపోతోంది యువతలో అందుకే ఇలా కొత్త తరహా పెళ్ళికి సిద్ధం అవుతున్నారు.

నితిన్ తాజాగా భీష్మ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ సినిమా విడుదల అయ్యాక  నితిన్ పెళ్లి చేసుకోనుండటం విశేషం. నితిన్ కుటుంబ సభ్యులతో పాటుగా మిత్రులు అలాగే సినిమా రంగానికి చెందిన కొంతమంది సన్నిహితులకు కూడా పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేశారట. డేట్ లాక్ చేసుకోండని రిక్వెస్ట్ కూడా చేశారట. ఇక నితిన్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు కాదనలేకపోయారట.