ఎం ఎస్ రాజు నీకిది తగునా ?

Published on Jan 05,2020 12:05 PM

టాలీవుడ్ లో మోస్ట్ ప్రామిసింగ్ ప్రొడ్యూసర్ ఎవరయ్యా అంటే వేళ్ళ మీద లెక్కపెట్టగలిగే నిర్మాతలలో ఒకరిగా గుర్తింపు పొందాడు ఎం ఎస్ రాజు. పైగా 90 వ దశకంలో అసలు సిసలైన మేకర్ గా చరిత్ర సృష్టించాడు ఈ ఎం ఎస్ రాజు. అయితే సంచలన విజయాలు అందుకున్న ఈ నిర్మాత ఆ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడ్డాడు దాంతో కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఆ తర్వాత దర్శకుడిగా ప్రయత్నించాడు , చేసిన రెండు చిత్రాలు కూడా ప్లాప్ కావడంతో ఇప్పుడు అడల్ట్ స్టోరీ తో ఓ సినిమా చేస్తున్నాడు'' డర్టీ హరి '' అని.

తాజాగా ఈ డర్టీ హరి ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ చూసి ఎం ఎస్ రాజు ఇలాంటి సినిమాలను చేయడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు. శత్రువు , పోలీస్ లాకప్ , ఒక్కడు , వర్షం , మనసంతా నువ్వే వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన ఎం ఎస్ రాజు అడల్ట్ స్టోరీ నేపథ్యంలో సినిమా చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు. నిర్మాతగా అజరామరమైన చిత్రాలను నిర్మించిన ఎం ఎస్ రాజు ఇలాంటి చిత్రాలకు దర్శకత్వం వహించడం చూసి ఎం ఎస్ రాజు నీకిది తగునా అంటూ ప్రశ్నిస్తున్నారు.