నాగబాబు తప్పు చేశాడా ?

Published on Nov 25,2019 11:12 AM

మెగా బ్రదర్ జబర్దస్త్ నుండి తప్పుకొని తప్పు చేశాడా ? అంటే అవుననే అనిపిస్తోంది. జబర్దస్త్ బుల్లితెర పై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఎందరో కమెడియన్స్ ని జబర్దస్త్ రూపంలో వెలుగులోకి తెచ్చింది. ఏడున్నర సంవత్సరాలుగా జబర్దస్త్ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తోంది. ఇక జడ్జి లుగా నాగబాబు , రోజా ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కూడా. కానీ సైద్ధాంతిక విబేధాలు అంటూ ఈ షో నుండి నాగబాబు తప్పుకున్నాడు.

ఈ షో నుండి తప్పుకొని మరొక ఛానల్ లో '' సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ...... అన్నీ జరుగుతాయా ఏంటి '' అనే కార్యక్రమంలో పాల్గొన్నాడు నాగబాబు. అయితే ఈ కార్యక్రమం నిన్న ఆ ఛానల్ లో ప్రారంభమయింది. కానీ ఆ కార్యక్రమం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. మొదటి షో లోనే ఆ షో తేలిపోయింది. ఇలాంటి కార్యక్రమంలో నాగబాబు పాల్గొని తప్పు చేసాడని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి మరి. ముందు ముందు అయినా ఆ షో ఆకట్టుకునేలా సాగుతుందా ? లేక చతికిల బడుతుందా ? చూడాలి.