నాగార్జున ఆ సినిమా ఒప్పుకోవడం కష్టమే !

Published on Mar 22,2019 12:38 PM

బుల్లితెర అన్నయ్య ఓంకార్ తాజాగా రాజుగారి గది 3 చిత్రం చేసే పనిలో పడ్డాడు . రాజుగారి గది హిట్ కావడంతో రాజుగారి గది 2 చేసాడు . అయితే నాగార్జున , సమంత లు నటించినప్పటికీ రాజుగారి గది 2 మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు అయినప్పటికీ బుల్లితెర అన్నయ్య ఓంకార్ మాత్రం మా సినిమా హిట్ అంటూ ప్రచారం చేసుకున్నాడు . కట్ చేస్తే ఇప్పుడు రాజుగారి గది 3 చేసే పనిలో పడ్డాడు . 

అయితే ఈ సినిమాలో నాగార్జున ని మళ్ళీ నటింప జేయాలని చూస్తున్నాడట ఓంకార్ . అయితే నాగార్జున ఈ సీక్వెల్ సినిమాలో నటించడం కష్టమే అని అంటున్నారు . ఎందుకంటే ఇప్పటికే రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు నాగ్ . ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ ఈ సినిమా ఒప్పుకోవడం కష్టమే ! పైగా రొటీన్ సినిమా అని ఫీలయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నాగ్ డౌటే !