నగ్మా పెళ్లి త్వరలోనే !

Published on Apr 02,2019 17:14 PM
44 ఏళ్ల నగ్మా ఎట్టకేలకు పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . దక్షిణాదిన తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ చిత్రాలతో పాటుగా హిందీలో కూడా నటించింది నగ్మా . అంతేకాదు భోజ్ పురి చిత్రాల్లో కూడా నటించింది . అయితే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది కానీ పెళ్లి చేసుకోలేదు . 
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళనాడుకి చెందిన ఓ పారిశ్రామిక వేత్తని నగ్మా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది . నగ్మా సోదరి జ్యోతిక తమిళ హీరో సూర్య భార్య అన్న విషయం తెలిసిందే . దాంతో ఆమె అక్క నగ్మా కు పెళ్లి చేయడానికి ఈ సంబంధం వెతికిందట . ఇక నగ్మా కూడా 44 ఏళ్ళు పూర్తి కావడంతో కాబోలు పెళ్ళికి ఒప్పుకుంది .త్వరలోనే నగ్మా కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది .