తరుణ్ భాస్కర్ తదుపరి సినిమా ఏంటి ?

Published on Nov 29,2019 17:20 PM

పెళ్లిచూపులు చిత్రంతో సంచలన విజయం అందుకొని తెలుగు సినిమా రంగాన్ని తనవైపుకు తిప్పుకునేలా చేసిన దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అయితే మంచి వసూళ్లు వచ్చాయి కానీ ఆశించిన విజయం మాత్రం అందుకోలేకపోయాడు తరుణ్ భాస్కర్. అయితే ఒకవైపు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు పలు చిత్రాల్లో నటించడం కూడా మొదలు పెట్టాడు.

మహానటి , ఫలక్ నుమా దాస్, సమ్మోహనం చిత్రాల్లో నటించాడు అలాగే ఆ చిత్రాల తర్వాత హీరోగా మీకు మాత్రమే చెప్తా చిత్రంలో నటించాడు తరుణ్ భాస్కర్. కట్ చేస్తే ....... మీకు మాత్రమే చెప్తా కూడా హిట్ కాలేదు కానీ నటుడిగా తరుణ్ భాస్కర్ కు మంచి పేరే వచ్చింది. అయితే కావాల్సింది సక్సెస్ కాబట్టి మళ్ళీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నాడు. తన తదుపరి చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే అందులో హీరో ఎవరు ? అన్నది తేలాల్సి ఉంది.