పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ తప్పదా ?

Published on Sep 29,2019 10:58 AM
పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ తప్పదా ?

గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పి తో బాధపడ్డాడు. ఇక అప్పటి నుండి ఆ నొప్పి తరచుగా పవన్ ని వెంటాడుతూనే ఉంది. యాక్షన్ దృశ్యాల్లో పాల్గొన్న సమయంలో వెన్ను నొప్పి కి గురయ్యాడు పవన్ ఇక అప్పటి నుండి అడపా దడపా బాధపెడుతూనే ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్ కు వెన్ను నొప్పి తిరిగి ఇబ్బంది పెడుతుడటంతో పవన్ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది.
ఇక ఆ నొప్పి తరచుగా ఇబ్బంది పెడుతుండటంతో ఆపరేషన్ తప్పదా ? అనే చర్చ సాగుతోంది. అయితే ఆపరేషన్ కాకుండా కేరళ వైద్యం తో నొప్పి నివారణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరమైన పవన్ మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ట్రై చేస్తున్నాడట.