చిరంజీవిపై విష ప్రయోగం ?

Published on Feb 08,2020 16:37 PM

మెగాస్టార్ చిరంజీవి పై విష ప్రయోగం జరిగిందని , ఆయన్ని నెంబర్ హీరోగా చూడటం ఇష్టం లేని వాళ్ళు ఇలాంటి దురాగతానికి పాల్పడి ఉంటారని అప్పట్లో అంటే 1988 లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఆ కథనాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే ఈ కథనాలు రావడానికి అసలు కారణం ఏంటో తెలుసా ...... 1988 లో చిరంజీవి మరణ మృదంగం చిత్రంలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి అభిమానులు తరలివచ్చారు.

అందులో ఒక అభిమాని నా పుట్టినరోజు అని కేక్ తీసుకురావడమే కాకుండా కేక్ కట్ చేసి చిరంజీవికి తినిపించబోయాడు. అయితే చిరు దాన్ని సున్నితంగా తిరస్కరించాడు కానీ అదే సమయంలో అభిమానుల హడావుడి ఎక్కువ కావడంతో ఆ కేకు కిందపడింది. ఆ కేకు లోంచి ఓ ప్యాకెట్ బయటపడటంతో అది విషమని భావించిన చిత్ర బృందం పోలీసులకు సమాచారమందించి కేకు ని ల్యాబ్ కు పంపించారు. అయితే అందులో విషం ఉన్నట్లుగా మాత్రం ఇంతవరకు తేలలేదు కానీ అప్పట్లో మాత్రం పలు పత్రికల్లో ఈ వార్తలు వచ్చి సంచలనం సృష్టించాయి