చెన్నై బీచ్ లో ఇల్లు కొననున్న ప్రభాస్

Published on Dec 23,2019 09:49 AM

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చెన్నై బీచ్ లో ఇల్లు కొనాలని చూస్తున్నాడట. చెన్నై మహానగరంలో ప్రభాస్ కు వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఉన్నాయి కానీ అవి కాకుండా చెన్నై బీచ్ లో ఓ విలాసవంతమైన ఇంటిని కొనాలని చూస్తున్నాడట. బీచ్ లో విలాసవంతమైన ఇంటిలో సముద్రాన్ని చూస్తూ సేద తీరాలని ఆశగా ఉందట ప్రభాస్ కు అందుకే ఎప్పటి నుండో అలాంటి ఇంటిని కొనాలని చూస్తున్న సమయంలో చెన్నై బీచ్ లో ఓ ఇల్లు అమ్మకానికి వచ్చిందట.

దాంతో ఆఇంటిని ఎంత రేటు పెట్టి అయినా కొనాలని ఫిక్స్ అయ్యాడట ఈ హీరో. ఆ ఇంటిని కొని సముద్ర తీరాన్ని చూస్తూ ఎంజాయ్ చేయాలనీ భావిస్తున్నాడు. ప్రభాస్ కు భారీ రెమ్యునరేషన్ వస్తోంది కాబట్టి ఎంత రేటు అయినా సరే పెట్టి కొనడానికి ఇబ్బంది ఏముండదు పైగా విలాసవంతమైన భవంతి ఉంటే అది ఎన్నో రేట్లు విలువ పెరగడం ఖాయం కూడా. ఇటీవలే సాహో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ దెబ్బ తిన్నాడు ఇక ఇప్పుడేమో జాన్ చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా 2020 లో విడుదల కానుంది.