కాంచన పది చిత్రాల వరకు చేస్తాడట

Published on Mar 29,2019 12:59 PM

హీరో , దర్శకుడు రాఘవ లారెన్స్ హర్రర్ చిత్రాలతో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . ముని , కాంచన , గంగ , చిత్రాలు సంచలన విజయాలు సాధించడమే కాకుండా పెద్ద ఎత్తున డబ్బులను కూడా తెచ్చిపెట్టాయి లారెన్స్ కు దాంతో కాంచన 3 , ముని 4 చిత్రం చేసాడు . ఇక ఈ సిరీస్ ఇలాగె కొనసాగిస్తూ ఏకంగా పది చిత్రాల వరకు చేసుకుంటూ పోతానని మనసులో మాట చెప్పాడు రాఘవ లారెన్స్ . 

కాంచన 3 ట్రైలర్ నిన్న రిలీజ్ అయ్యింది , భారీ విజువల్స్ తో మరోసారి ప్రేక్షకులను అలరించేలా రూపొందించాడు లారెన్స్ . ఇక ఈ చిత్రంలో కూడా యధావిధిగా కోవై సరళ ని కంటిన్యూ చేసాడు అలాగే లారెన్స్ కూడా కీలక పాత్రలో నటించాడు . ఇక ఈ కాంచన 3 ని ఏప్రిల్ 19 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఈ సినిమా హిట్ అయితే ఆ ట్రెండ్ అలాగే కంటిన్యూ చేస్తాడట లారెన్స్ .