త్రివిక్రమ్ తో రాంచరణ్ ?

Published on Jan 17,2020 19:12 PM

అల ...... వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన తదుపరి చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. రాంచరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని జులై 30 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు దాని తర్వాత చరణ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడు. కానీ వంశీ పైడిపల్లి తాజాగా మహేష్ బాబు తో సినిమా కు సిద్ధం అవుతున్నాడు.

దాంతో చరణ్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ లో అల్లూరి సీతారామరాజు పాత్ర కాబట్టి పీక్స్ లో ఉండటం ఖాయం అందుకే దానికి క్రాంట్రాస్టుగా ఉండేలా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తే లెవల్ అవుతుందని డిసైడ్ అయ్యాడట చరణ్. ఆమేరకు త్రివిక్రమ్ కు ఓ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న కథ రెడీ చేయమని చెప్పాడట. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.