200 కోట్లతో సినిమానా

Published on Dec 15,2018 10:23 AM

దగ్గుబాటి రానా హీరోగా స్టార్ డం అందుకోలేదు కానీ నటుడిగా మాత్రం మంచి పేరు ఉంది , బాహుబలి పుణ్యమా అని రానా పేరు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది . బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోతోంది . తాజాగా దర్శకుడు గుణశేఖర్ రానా తో హిరణ్య కశ్యప అనే సినిమాకు శ్రీకారం చుడుతున్నాడు . ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ....... 200 కోట్లు . వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నాడు . 

గుణశేఖర్ దర్శకుడిగా సత్తా చాటాడు కానీ అతడి సినిమా 80 కోట్లకు మించలేదు , అలాగే రానా సోలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ అందుకున్న దాఖలాలు లేవు అలాంటిది ఈ ఇద్దరి కాంబినేషన్ లో 200 కోట్ల భారీ బడ్జెట్ అంటే చాలా చాలా రిస్క్ ...... అయినప్పటికీ ఆ రిస్క్ చేయడానికి సాహసం చేస్తున్నాడు గుణశేఖర్ . ఇంతటి భారీ బడ్జెట్ తో సినిమా రూపొందిస్తే మళ్ళీ తిరిగి రాబట్టగలరా అన్నది పెద్ద అనుమానమే కాకపోతే వీళ్ళ వెనుక బిజినెస్ లో  మాస్టర్ అయిన దగ్గుబాటి సురేష్ బాబు ఉన్నాడు కాబట్టి అనుమానం అక్కర్లేదనుకుంటా .