క్షమాపణ కోరిన రాశి ఖన్నా

Published on May 17,2019 16:43 PM
హీరోయిన్ రాశి ఖన్నా క్షమాపణ కోరడం సంచలనంగా మారింది . తనకు సంబంధం లేకపోయినప్పటికీ , తన తప్పు లేనప్పటికీ సారీ చెప్పి తన గొప్ప మనసు చాటుకుంది.  ఇంతకీ అసలు విషయం ఏంటంటే ....... తెలుగులో సూపర్ హిట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం టెంపర్ ని తమిళ్ లో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ చేసారు . కాగా ఆ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ పాత్రలో రాశి ఖన్నా నటించింది . 

అయితే ఈ భామ డబ్బింగ్ చెప్పుకోదు కాబట్టి రవీనా చేత డబ్బింగ్ చెప్పించారు . అయితే సినిమా టైటిల్స్ కార్డ్స్ లో అందరి పేర్లు వేశారు కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ల పేర్లు మాత్రం వేయలేదట దాంతో కోపగించుకున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ రవీనా ఆవేదన తో ట్వీట్ చేసింది . ఆ ట్వీట్ రాశి ఖన్నా ని చేరడంతో నొచ్చుకున్న ఈ భామ అందుకు సారీ చెప్పింది . అదన్న మాట విషయం .