మార్చ్ 26 న ఆర్ ఆర్ ఆర్ చరణ్ లుక్ విడుదల ?

Published on Nov 10,2019 15:49 PM
2020 మార్చ్ 26 న ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని రాంచరణ్ లుక్ ని విడుదల చేయనున్నారట ! ఆరోజే చరణ్ లుక్ ని ఎందుకు విడుదల చేయడం అని అనుకుంటున్నారా ? ఎందుకంటే మార్చ్ 27 న రాంచరణ్ పుట్టినరోజు కాబట్టి, దానికి ఒక రోజు ముందుగా అంటే మార్చ్ 26 న సాయంత్రం చరణ్ లుక్ ని విడుదల చేయనున్నారట. ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ లు నటిస్తుండటం ఒక కారణమైతే , ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కావడం మరో విశేషం. అలాగే బాహుబలి చిత్రాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రం కాబట్టి. చరణ్ సరసన అలియా భట్ నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జూలై 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.