ఆ డైరెక్టర్ హీరోయిన్ లపై పుకార్లు

Published on Jan 18,2020 15:35 PM

దర్శకులు , నటుడు ఎస్ జె సూర్య హీరోయిన్ ప్రియా భవాని శంకర్ లపై తమిళనాట పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ ఇద్దరూ ఓ తమిళ సినిమాలో నటిస్తున్నారు దాంతో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది ఈ సాన్నిహిత్యాన్ని చూసి ఇద్దరి మధ్య ఏదో సాగుతోందని పుకార్లు షికారు చేసున్నాయి కట్ చేస్తే తాజాగా మరో పుకారు షికారు చేస్తోంది ఇంతకీ ఆ పుకారు ఏంటంటే ....... ఎస్ జె సూర్య ప్రియా భవాని శంకర్ కు లవ్ ప్రపోజ్ చేసాడని దానికి ఆమె నిరాకరించిందని ఇదంతా షూటింగ్ సమయంలోనే అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ పుకార్లు ఎస్ జె సూర్య చెవిన పడటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. ప్రియా భవాని శంకర్ తో నాకు మంచి స్నేహం ఉంది అంతేకాని మామధ్య ఎలాంటి ప్రేమ , గొడవలు లేవని స్పష్టం చేసాడు. అసలు పని పాట లేని వాళ్లే ఇలాంటి పుకార్లని పుట్టిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. డైరెక్టర్ గా హీరోగా , విలన్ గా విభిన్న పార్శ్వాలను స్పృశిస్తున్న ఎస్ జె సూర్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే అన్న విషయం తెలిసిందే.