సాహో బయ్యర్లు రోడ్డున పడనున్నారా ?

Published on Sep 01,2019 12:52 PM
ప్రభాస్ నటించిన సాహో భారీ అంచనాల మధ్య విడుదలై భారీ ఓపెనింగ్స్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటిరోజున ప్రపంచవ్యాప్తంగా 104 కోట్ల గ్రాస్ వసూళ్ల ని 68 కోట్ల షేర్ ని రాబట్టింది. అయితే ఈ సినిమాని కొన్న బయ్యర్లకు పెట్టిన పెట్టుబడి రావాలంటే ఎన్ని కోట్ల షేర్ రాబట్టాలో తెలుసా ........ 320 కోట్లకు పైగా షేర్ వసూల్ కావాలి. 

ఇంత షేర్ రావాలంటే దాదాపు 700 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించాలి కానీ సాహో చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చింది దాంతో ఈ భారీ వసూళ్లు సాధించడం కష్టమే ! అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు కానీ వాళ్లలో చాలామంది రోడ్డున పడటం ఖాయమని అంటున్నారు.