ఇప్పుడైనా హిట్ కొడతాడా ఈ హీరో

Published on Mar 22,2019 14:52 PM

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా నటిస్తున్న చిత్రం '' చిత్రలహరి ''. అయితే ఈ చిత్రంలో తన పేరుని సాయి ధరమ్ తేజ్ గా కాకుండా ''సాయి తేజ్ '' గా మార్చుకున్నాడు . ఇకపై సినిమా టైటిల్స్ లో ఇదే పేరు ఉంటుందట ! అంటే సెంటిమెంట్ ప్రకారం పెట్టుకున్న పేరు అన్నమాట ! మరి ఇలా పేరు పేర్చుకొని పెట్టుకుంటే హిట్ కొడతాడా ? 

కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ' చిత్రలహరి '. ఈ సినిమాపై మెగా హీరో సాయి తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఎందుకంటే ఈ హీరో నటించిన ఆరు సినిమాలు వరుసగా డిజాస్టర్ లు అయ్యాయి దాంతో సాయి తేజ్ కు వచ్చిన క్రేజ్ మొత్తం పోయింది . దాంతో సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు మెగా హీరో . మరి ఈ పేరు మార్పుతో హిట్ కొడతాడేమో చూడాలి . ఏప్రిల్ 5 న చిత్రలహరి రిలీజ్ కానుంది.