సమంత ప్రభాస్ తో నటించదా ?

Published on Apr 02,2019 13:12 PM

అగ్రశ్రేణి కథానాయిక సమంత ఇప్పటివరకు స్టార్ హీరోల అందరి సరసన నటించింది ఒక్క ప్రభాస్ తప్ప . పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , ఎన్టీఆర్ , అల్లు అర్జున్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పొతే పెద్దదే ఉంది అలాగే యంగ్ హీరోల సరసన కూడా నటించింది కానీ ప్రభాస్ కు మాత్రం ఇప్పటివరకు జంటగా నటించలేదు దాంతో ప్రభాస్ - సమంత జంటగా ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు అగ్ర నిర్మాత దిల్ రాజు . 

ఇప్పటివరకు అందరి హీరోల సరసన నటించి ప్రభాస్ తో నటించకపోయేసరికి సమంత ప్రభాస్ తో నటించదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ . దాంతో దిల్ రాజు ఈ ఇద్దరినీ కలిపి సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీ గా ఉన్నాడు దాని తర్వాత సమంత తో సినిమా ఉండొచ్చు అని తెలుస్తోంది .