సమంత ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట

Published on Dec 15,2019 16:13 PM

సమంతకు బాలీవుడ్ లో ఛాన్స్ వస్తే ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట! దాంతో బాలీవుడ్ ఆఫర్ ని ఎందుకు తిరస్కరించిందనే చర్చ మొదలయ్యింది. ఇంతకీ బాలీవుడ్ లో చేయాలనుకున్న సినిమా ఏంటో తెలుసా ? యు టర్న్ చిత్రం. కన్నడంలో పెద్ద హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో యు టర్న్ గా రీమేక్ చేసింది సమంత. ఈ సినిమాని ఎంతో ఇష్టపడి చేసింది కానీ అది ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు దాంతో నిరాశచెందింది. కట్ చేస్తే అదే సినిమా ని తాజాగా హిందీలో రీమేక్ చేస్తున్నారట దాంట్లో సమంతని నటించమని ఆఫర్ ఇచ్చారట.

అయితే సమంత మాత్రం బాలీవుడ్ ఆఫర్ ని మొహమాటం లేకుండా తిరస్కరించిందట. బాలీవుడ్ ఆఫర్ వస్తే ........ సంతోషంగా ఒప్పుకుంటారు కానీ సమంత మాత్రం బాలీవుడ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసి సంచలనంగా మారింది. ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేయడానికి కారణం యు టర్న్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కాబట్టే ఇలా బాలీవుడ్ ఆఫర్ ని తిరస్కరించి ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ భామ 96 అనే రీమేక్ చిత్రంలో శర్వానంద్ సరసన నటిస్తోంది. ఈ 96 చిత్రం తప్ప సమంత చేతిలో మరో సినిమా ఏది లేదు మరి.