సమంత - శర్వానంద్ ల జాను రిలీజ్ ఎప్పుడో తెలుసా ?

Published on Nov 25,2019 16:02 PM

సమంత - శర్వానంద్ తాజాగా '' జాను '' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకుంది జాను చిత్రం. అయితే కొంత బ్యాలెన్స్ వర్క్ ఉంది దాంతో బ్యాలెన్స్ వర్క్ ని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి జాను చిత్రాన్ని ఫిబ్రవరి 7 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రాన్ని తెలుగులో జాను గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ ని తెలుగులో కూడా డైరెక్షన్  చేయమని కోరడంతో ప్రేమ్ కుమార్ అంగీకరించాడు. ఓ బేబీ అంటూ సోలోగా వచ్చిన సమంత సాలిడ్ హిట్ అందుకుంది దానికి తోడు తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమా కావడంతో జాను చిత్రంపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ఇక శర్వానంద్ కు కూడా ఈ సినిమా విజయం తప్పనిసరి ఎందుకంటే శర్వా కు హిట్ లేకుండాపోయింది మరి.