మహర్షి సినిమా అన్ని గంటలా ?

Published on Mar 11,2019 11:42 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం '' మహర్షి '' . అయితే ఈ సినిమా రష్ విషయంలో సంచలనంగా మారింది . ఈ సినిమా ఎడిట్ వెర్షన్ అయిపోయాక ఎన్ని గంటలు ఉందో తెలుసా ........ 4 గంటలు . అవును నాలుగు గంటల ఎడిట్ వెర్షన్ వచ్చిందట అంటే రెండు సినిమాల ఫుటేజ్ అన్నమాట దాంతో నలభై నిముషాల వేస్టేజ్ తీసి పడేసారట దాంతో 3 గంటల 20 నిముషాలు ఉంది ప్రస్తుతానికి . 

ఈ 3 గంటల 20 నిమిషాల నుండి కూడా మరికొంత తొలగించనున్నారు చిత్ర బృందం . ఫైనల్ వెర్షన్ 3 గంటలుగా ఉంచాలని చూస్తున్నారట . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . మహేష్ బాబు సరసన పూజా  హెగ్డే నటిస్తుండగా కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు .