చిరంజీవి పక్కన శృతి హాసన్ సెట్ అవుతుందా ?

Published on Apr 05,2019 12:09 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాని దాదాపుగా అయిపోవస్తోంది దాంతో జూన్ నుండి కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు చిరు . సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే . చరణ్ నిర్మించే ఈ సినిమా లో చిరంజీవి సరసన పలు కథానాయికలను అనుకుంటున్నారు , అందులో శృతి హాసన్ ఒకరు . 

అయితే శృతి హాసన్ చిరంజీవి పక్కన సెట్ అవుతుందా ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . ఎందుకంటే హైట్ పరంగా చూసుకున్నా , వెయిట్ పరంగా చూసుకున్నా చిరంజీవి తో శృతి సెట్ అవ్వడం కుదరదు . కాకపోతే గ్లామర్ కోసమే పెట్టుకోవాలి . ఇప్పటికే స్టాలిన్ చిత్రంలో త్రిష తో రొమాన్స్ చేసి అబాసుపాలయ్యాడు చిరంజీవి . మరి ఇప్పుడైనా శృతి హాసన్ సెట్ అవుతుందా ? లేదా చూసుకొని పెట్టుకుంటారో ? లేదో ?