ఆ హీరోయిన్ ని బెడ్ రూంలోకి తీసుకెళ్లారట

Published on Nov 16,2019 01:42 AM

రేప్ సీన్ లో చాలా సహజంగా నటించాలి అందుకు రిహార్సల్స్ చేస్తావా ? అంటూ నేరుగా ఆ హీరోయిన్ ని బెడ్ రూంలోకి తీసుకెళ్లారట ఓ సినిమా దర్శక నిర్మాతలు. అయితే అక్కడి వాతావరణం చూసాక అది సినిమా తీసేవాళ్ళ లక్షణంగా లేకపోవడంతో బ్రతుకు జీవుడా అంటూ పరుగెత్తుకుంటూ వచ్చానని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది నటి '' మాన్వి గాగ్రు ''. బాలీవుడ్ నటి అయిన మాన్వి ఓ సినిమా ఛాన్స్ కోసం వెళ్ళినప్పుడు ఇలాంటి చేదు సంఘటన ఎదురయ్యిందని వాపోయింది.

తెలుగు , తమిళ్ , మలయాళ,హిందీ అనే తేడా లేకుండా అన్ని చోట్లా కాస్టింగ్ కౌచ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇలా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తోంది అవకాశాలు అంతగా లేనివాళ్లు మాత్రమే ! సక్సెస్ లో ఉన్నవాళ్లు మాత్రం ఇలా ఆరోపణలు చేయడం లేదు దాంతో వీటికి అంతగా ప్రాధాన్యత లేకుండాపోయింది. ఇటీవలే వెబ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన మాన్వి గాగ్రు ఇలా మీటు ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కింది.