ఎన్టీఆర్ సరసన జాక్వెలెన్

Published on Apr 25,2019 09:36 AM

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ సరసన శ్రీలంక భామ జాక్వెలెన్ ఫెర్నాండేజ్ ని తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది . ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మొదట బ్రిటిష్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ ని తీసుకున్నారు హీరోయిన్ గా అయితే ఆ భామ షూటింగ్ సమయానికి హ్యాండ్ ఇచ్చి తప్పుకుంది దాంతో హీరోయిన్ ల వేటలో పడ్డాడు జక్కన్న . అయితే పలువురు పేర్లు పరిశీలనకు వచ్చాయి కానీ ఒక్కరు కూడా సెట్ కాలేదు ఎందుకో ! 

అయితే ఇప్పుడు మాత్రం జాక్వెలెన్ ఫెర్నాండేజ్ పేరు వినిపిస్తోంది . బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న ఈ భామ ని ఎన్టీఆర్ కోసం ఎంపిక చేయాలనే ఆలోచన చేస్తున్నారట జక్కన్న అలియాస్ ఎస్ ఎస్ రాజమౌళి . చరణ్ పక్కన అలియా భట్ సెట్ అయ్యింది కానీ ఎన్టీఆర్ కు మాత్రం ఏ హీరోయిన్ ఇంకా సెట్ కావడం లేదు . దాంతో అన్వేషణ సాగుతోంది . శ్రీలంక భామ  జాక్ సెట్ అయితే యమా హాట్ అనే చెప్పాలి .