సుమ మళ్ళీ ప్రేమలో పడుతుందట

Published on Dec 18,2018 12:10 PM

యాంకర్ గా సంచలనం సృష్టిస్తున్న భామ సుమ కు మళ్ళీ ప్రేమలో పడిపోవాలని ఆశగా ఉందట ! నిన్న జరిగిన పడిపడి లేచి మనసు ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న సుమ సంచలన వ్యాఖ్యలు  చేసింది . అయితే ప్రేమలో పడాలని అంది కానీ మళ్ళీ రాజీవ్ కనకాల తోనే ప్రేమలో పడాలని ఆశపడుతోందట ! చివర్లో మళ్ళీ రాజీవ్ కనకాల తోనే అని అనడంతో అందరు ఘొల్లున నవ్వారు లేదంటే మరో అర్ధం వచ్చేది తప్పకుండా . 

తెలుగునాట సుమ యాంకర్ గా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న విషయం తెలిసిందే . ఒక్కో ఈవెంట్ కు 2 లక్షల నుండి 3 లక్షల వరకు వసూల్ చేస్తూ టాప్ గేర్ లో దూసుకుపోతోంది సుమ . శర్వానంద్ - సాయి పల్లవి జంటగా నటించిన పడిపడి లేచె మనసు చిత్రం ఈనెల 21న విడుదల అవుతున్న నేపథ్యంలో నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది . ఆ వేడుకకు హోస్ట్ గా వ్యవహరించింది సుమ . రాజీవ్ కనకాల - సుమ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే .