సైరా మళ్ళీ వాయిదాపడుతోందా

Published on Aug 30,2019 10:50 AM

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ఇప్పటికే ఒకటి రెండుసార్లు వాయిదాపడగా ఈసారి మళ్ళీ వాయిదాపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2 న సైరా నరసింహారెడ్డి విడుదల కానున్నట్లు స్వయంగా చిరంజీవి వెల్లడించాడు అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 2 న కాకుండా అక్టోబర్ 8 న విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. 

అక్టోబర్ 2 న హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ లు నటించిన మల్టీస్టారర్ చిత్రం వార్ విడుదల అవుతుండటంతో అదే రోజున సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని విడుదల చేయడం వల్ల థియేటర్ ల సమస్య వస్తుందని భావిస్తున్నారట దాంతో అక్టోబర్ 2 కి బదులుగా అక్టోబర్ 8 న విడుదల చేయాలనీ అనుకుంటున్నారట. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చని అంటున్నారు.