అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామని దించుతున్న త్రివిక్రమ్

Published on Mar 22,2019 12:29 PM

అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ టబు ని దించుతున్నాడు దర్శకులు త్రివిక్రమ్ . తాజాగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే . ఇంతకుముందు జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా రెండు కూడా హిట్ అయ్యాయి . ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కోసం మూడోసారి కలుస్తున్నారు . 

కాగా ఈ సినిమాలో 47 ఏళ్ల హాట్ భామ టబు ని తీసుకున్నారు . అల్లు అర్జున్ కు తల్లిగా టబు  నటించనున్నట్లు తెలుస్తోంది . పక్కా హైదరాబాదీ అయిన టబు ఎక్కువగా హిందీ చిత్రాల్లోనే నటించింది . తెలుగులో కూడా నటించింది కానీ తక్కువ సినిమాలు మాత్రమే ! 47 ఎల్లా వయసులో కూడా అందాలను ఆరబోస్తూ కైపెక్కిస్తున్న టబు తల్లి పాత్రలో ఎలా మెప్పించనుందో చూడాలి .