కౌగిలింత కావాలట

Published on Dec 19,2018 12:30 PM

రెండు తెలుగు రాష్ట్రాలలో గత మూడు రోజులుగా విపరీతమైన చలి గా ఉంది దాంతో బయటకు రావాలంటే భయపడి పోతున్నారు జనాలు . ఆంధ్రప్రదేశ్ లో పెథాయ్  తుఫాన్ ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గాయి . దాంతో బయటకు రాకుండా మీరంతా ఇంట్లోనే ఉండండి అందరూ గట్టిగా కౌగిలించుకోండి అంటూ ఉచిత సలహా ఇస్తోంది నటి తేజస్వి మదివాడ . టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా ఘాటు కౌగిలింత కావాలి అంటూ పెట్టిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది . 

చలిగా ఉంది కాబట్టి మీరు మీ ప్రేయసిని గట్టిగా వాటేసుకొని కౌగిలింతలు ఇచ్చుకోండి చలి దానంతట అదే పోతుంది అంటూ సలహా ఇస్తోంది తేజస్వి మదివాడ . నిజమే ఈ భామ ఇచ్చిన సలహా పాటిస్తే తప్పకుండా చలి దూరం కావడం ఖాయమే ! విపరీతమైన చలి కాబట్టి అందరికీ సలహా ఇస్తోంది బాగానే ఉంది కానీ ఈ భామ సింగిల్ మరి ఎవరి కౌగిలింతని ఆస్వాదిస్తుందో ? ఏంటో ?