ఆ సంచలన కాంబినేషన్ 2021 లోనట !

Published on Dec 26,2019 16:35 PM

బాహుబలి సినిమాతో ప్రభాస్ తన రేంజ్ ని పెంచుకుని సాహో వంటి ప్లాప్ సినిమాతో కూడా భారీ వసూళ్లు సాధించగలను అని నిరూపించుకున్నాడు. తాజాగా ఈ హీరో జాన్ అనే చిత్రాన్ని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆ సినిమా తర్వాత పలు కథలు వింటున్నాడు కానీ అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ లను అందించిన సందీప్ రెడ్డి వంగా తో తన తదుపరి చిత్రం చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇటీవలే సందీప్ రెడ్డి చెప్పిన కథ ప్రభాస్ కు నచ్చడం పచ్చజెండా ఊపడం జరిగిపోయిందట.

అయితే ఈ సినిమా 2020 లో సెట్స్ మీదకు వెళ్ళదు 2021 లో మాత్రమే ఎందుకంటే సందీప్ రెడ్డి బాలీవుడ్ లో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ప్రభాస్ జాన్ కూడా 2020 లో విడుదల కానుంది దాంతో ఈ సంచలన కాంబినేషన్ లో వచ్చే సినిమా 2021 లోనే సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కున్న ఇమేజ్ కు సందీప్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ దర్శకుడు సెట్ అయితే ఆ సినిమా రేంజ్ ఇక చెప్పాలా ? రికార్డుల మోత మోగించడం ఖాయం. ప్లాప్ సినిమాతోనే భారీ వసూళ్ళని సాధించిన ప్రభాస్ కు సందీప్ రెడ్డి వంగా తోడైతే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం.