ఆర్ ఆర్ ఆర్ కథ ఇదేనా ?

Published on Dec 26,2018 15:39 PM

ఎన్టీఆర్ - రాంచరణ్ లు హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ''ఆర్ ఆర్ ఆర్ '' . వర్కింగ్ టైటిల్ ఆర్ ఆర్ ఆర్ గా నామకరణం చేసినప్పటికీ '' రామ రావణ రాజ్యం '' గా అనుకుంటున్నట్లు తెలుస్తోంది . ఇంకా హీరోయిన్ లను అధికారికంగా ప్రకటించలేదు కానీ ముగ్గురు హీరోయిన్ ల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి . అదితిరావు హైదరీ , కీర్తి సురేష్ , కైరా అద్వానీ ల పేర్లు మాత్రం వినిపిస్తున్నాయి . 

ఇక తాజాగా ఆర్ ఆర్ ఆర్ కథ ఇదే అంటూ పెద్ద చర్చ జరుగుతోంది . పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని , స్వాతంత్య్రానికి పూర్వం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని మళ్ళీ 2020 లో కథ కూడా ఉంటుందని దాంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ చరణ్ లు రెండు జన్మల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది అని తెలుస్తోంది . అప్పటి పగని ఇపుడు తీర్చుకోవడం అన్న కథ అన్నమాట . అయితే ఇవన్నీ ఊహాగానాలే ! అసలు కథ ఏంటి అన్నది మాత్రం 2020 లోనే తెలిసిపోనుంది .