విజయ్ దేవరకొండ సరసన ఆ ఇద్దరు భామలా ?

Published on Nov 29,2019 17:16 PM

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఇద్దరు హాట్ భామలు నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం '' వరల్డ్ ఫేమస్ లవర్ '' పూర్తయ్యాక పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటించనున్నాడు. ఇక ఆ చిత్రంలో ఇద్దరు హాట్ భామలు నిధి అగర్వాల్ , ప్రియా ప్రకాష్ వారియర్ లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిధి అగర్వాల్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

ఇక ప్రియా ప్రకాష్ వారియర్ కన్ను గీటుతూ యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది. పైగా విజయ్ దేవరకొండ అంటే ప్రత్యేకమైన అభిమానం ఈ మలయాళ భామకు దాంతో ఈ ఇద్దరు హాట్ భామలు విజయ్ దేవరకొండ సరసన నటించడం ఖాయమని అంటున్నారు. కాకపోతే ఈ విషయాన్నీ అధికారికంగా పూరి జగన్నాధ్ ప్రకటించాల్సి ఉంది.