వెంకటేష్ తప్పు చేస్తున్నాడా ?

Published on Nov 20,2019 16:12 PM

తమిళంలో సంచలన విజయం సాధించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ముందుకు వచ్చాడు సీనియర్ హీరో వెంకటేష్. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి పలువురు దర్శకులను చూసి ..... చూసి పోయి పోయి ప్లాప్ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ అడ్డాల చేతిలో పెట్టారు దాంతో వెంకటేష్ తప్పు చేస్తున్నాడా ? అన్న చర్చ సాగుతోంది. ధనుష్ పోషించిన పాత్రని వెంకటేష్ పోషిస్తున్నాడు బాగానే ఉంది కానీ సక్సెస్ లో లేని శ్రీకాంత్ అడ్డాలకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించడమే బాగోలేదని అంటున్నారు.

ఇంతకుముందు వెంకటేష్ - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో '' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు '' అనే సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. అయితే దాని తర్వాత శ్రీకాంత్ అడ్డాల చేసిన చిత్రాలన్నీ ఘోర పరాజయం పొందాయి దాంతో ఈ దర్శకుడికి ఏ హీరో కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలో వెంకటేష్ ఛాన్స్ అంటే గొప్ప అవకాశం అనే చెప్పాలి. మరి ఆ ఛాన్స్ ని శ్రీకాంత్ అడ్డాల ఉపయోగించుకుంటాడా ? లేదా ? చూడాలి.