విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా ?

Published on Apr 17,2020 17:57 PM
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండని పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడాలని ఆశపడుతున్నారు పోలీసులు. కరోనా మహమ్మారి సందర్బంగా రాత్రనక పగలనక డ్యూటీలు చేస్తున్న పోలీస్ సిబ్బందితో మాట్లాడాడు హీరో విజయ్ దేవరకొండ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు పోలీసులు విజయ్ దేవరకొండతో మాట్లాడారు. ఆ సందర్బంగా పలువురు పోలీసులు మీరు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తే చూడాలని ఉందని కోరారు.

పోలీసులు కోరుకున్న విధంగా తప్పకుండా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాని , అయితే దానికి రెండు మూడేళ్లు సమయం పట్టేలా ఉందని సమాధానం ఇచ్చాడు విజయ్ దేవరకొండ. లవర్ బాయ్ గా నటించిన ఈ హీరోకు ఎనలేని క్రేజ్ వచ్చిపడింది. దాంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువ అయ్యాయి. తాజాగా ఈ హీరో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తో ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది.