డియర్ కామ్రేడ్ వాయిదా పడనుందా ?

Published on Mar 29,2019 12:46 PM

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే 31 న నాలుగు బాషలలో రిలీజ్ చేయనున్నామని అధికారికంగా ప్రకటించారు . అయితే మే 31 న తమిళ స్టార్ హీరో సూర్య నటించిన '' ఎన్ జి కే '' చిత్రం రిలీజ్ అవుతుండటంతో డియర్ కామ్రేడ్ రిలీజ్ డైలమాలో పడింది . డియర్ కామ్రేడ్ ఒక్క తెలుగులోనే రూపొందడం లేదు తెలుగుతో పాటుగా తమిళ , మలయాళ , కన్నడ బాషలలో రిలీజ్ కానుంది . 

తమిళనాట సూర్య స్టార్ హీరో దాంతో అదే రోజున విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ రిలీజ్ అంటే థియేటర్ లు దొరకడం కష్టం అలాగే భారీ ఓపెనింగ్స్ ని సాధించడం కూడా కష్టమే ! దాంతో పునరాలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది . మే 31 అంటే రిలీజ్ కి చాలా సమయం ఉంది కాబట్టి తప్పకుండా అప్పటిలోగా ఓ నిర్ణయానికి రానున్నారట డియర్ కామ్రేడ్ చిత్ర బృందం .