విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ ?

Published on Dec 10,2019 18:13 PM

అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ సరసన నటించనున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నారు. విజయ్ దేవరకొండ కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది అలాగే బాలీవుడ్ లో కూడా విజయ్ దేవరకొండ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిందీలో చేయలేదు ఈ హీరో కానీ అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేయడంతో విజయ్ దేవరకొండకు విపరీతమైన క్రేజ్ వచ్చింది ఒరిజినల్ హీరో అనే నెపంతో.

దాంతో ఈ హీరోని బాలీవుడ్ లో జరిగే పలు ఫంక్షన్ లకు ఆహ్వానిస్తున్నారు , ఇక ఆహ్వానం వచ్చిందే తడవుగా చాలా స్టైలిష్ గా వెళ్తున్నాడు ఇంకేముంది విజయ్ దేవరకొండకు ఎనలేని క్రేజ్ వచ్చేసింది. ఇక జాన్వీ కపూర్ కు కూడా ఈ హీరో అంటే చాలా చాలా ఇష్టం. ఇప్పటికే రెండు మూడు సార్లు విజయ్ అంటే ఇష్టమని ప్రకటించింది జాన్వీ. దాంతో ఫైటర్ చిత్రంలో ఒక హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నారట. ఫైటర్ చిత్రం మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం కావడంతో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే చిత్రంలో మరో హీరోయిన్ గా కియారా అద్వానీ ని కూడా తీసుకొనే ఆలోచనలో ఉన్నారట దర్శకులు పూరి జగన్నాధ్.