విజయ్ దేవరకొండ ఆ సినిమాని రిజెక్ట్ చేసాడట

Published on Dec 27,2018 17:16 PM

విజయ్ దేవరకొండ తాజాగా బాలీవుడ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది . 1983 లో కపిల్ దేవ్ నేతృత్వంలోని ఇండియా వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే . కాగా సందర్భాన్ని పురస్కరించుకొని ''83 ''అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు . అయితే ఆ బాలీవుడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ గెస్ట్ పాత్రలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర పోషించనున్నట్లు వార్తలు వచ్చాయి .  సదరు దర్శక నిర్మాతలు విజయ్ దేవరకొండ ని అడిగారట కూడా . 

అయితే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూ గెస్ట్ పాత్ర పోషిస్తే ఇక అలాంటి పాత్రలే ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట . కరణ్ జోహార్ నిర్మించే చిత్రంలో సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నాడట విజయ్ ,అందుకే 83 ఆఫర్ ని తిరస్కరించాడు . టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో విజయ్ ఇప్పుడు బాలీవుడ్ బాట పడుతున్నాడు .