మహానటి దర్శకుడితో మళ్ళీ విజయ్ దేవరకొండ

Published on Aug 19,2019 11:14 AM

మహానటి వంటి క్లాసిక్ చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది . ఇంతకుముందు నాగ్ అశ్విన్ - విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో '' ఎవడే సుబ్రహ్మణ్యం '' , '' మహానటి '' చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే . ఎవడే సుబ్రహ్మణం చిత్రంలో నాని హీరో కాగా విజయ్ దేవరకొండ ఓ ముఖ్య పాత్ర పోషించాడు . 

ఇక మహానటి లో సమంత లవర్ గా నటించిన విషయం తెలిసిందే . అయితే అప్పుడు విజయ్ దేవరకొండ కు అంతగా క్రేజ్ లేదు ఇమేజ్ లేదు కానీ ఇప్పుడు ఈ హీరోకు రౌడీ ఇమేజ్ ఉంది దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో నాగ్ అశ్విన్ . విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు దాంతో నిరాశలో ఉన్నాడు విజయ్ దేవరకొండ .