విరాటపర్వం సంచలనం సృస్టించనుందా ?

Published on Nov 11,2019 11:27 AM

రానా - సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. నీది నాది ఒకే కథ లాంటి విభిన్న కథా చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు ఉడుగుల ఈ విరాటపర్వం కు దర్శకత్వం వహిస్తున్నాడు. 1990 నాటి కాలం కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా రాజకీయ , సినిమా రంగంలో సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.

తెలంగాణలో 1990 కాలంలో నక్సల్స్ -పోలీస్ ల మధ్య భీకరపోరు సాగుతుండేది దాంతో ఆ అంశాలనే కథా వస్తువుగా ఎంచుకున్నాడట వేణు. దాంతో తప్పకుండా విరాటపర్వం చిత్రం సంచలన విజయం సాధించడం ఖాయమని నమ్ముతున్నారు. ఇప్పటికే వరంగల్ పరిసర ప్రాంతాల్లో ఈ విరాటపర్వం కొంత షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే రానా విరాటపర్వం షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. సాయి పల్లవి విభిన్న పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ బాబు చెరుకూరి సుధాకర్ తో కలిసి నిర్మిస్తున్నాడు.