హీరో విశాల్ డైరెక్టర్ మిస్కిన్ ల మధ్య గొడవ ?

Published on Feb 25,2020 10:49 AM

హీరో విశాల్ దర్శకులు మిస్కిన్ ల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో '' తుప్పరివాళన్ 2 '' మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో తుప్పరివాళన్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. తమిళనాట ఆ సినిమా మంచి హిట్ అయ్యింది దాంతో ఆ సినిమాకు సీక్వెల్ చేయాలనీ భావించారు. అంతేకాదు లండన్ లో ఒక షెడ్యూల్ కూడా జరిగింది. కానీ అక్కడ బడ్జెట్ విషయంలో తేడా రావడంతో విశాల్ కు మిస్కిన్ కు గొడవ జరిగిందట దాంతో ఆ సినిమా నుండి మిస్కిన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది.

తనకు ఇప్పుడున్న మార్కెట్ దృష్టా 40 కోట్ల బడ్జెట్ పెట్టడం అన్నది చాలా రిస్క్ అన్నది విశాల్ భావన కాగా మిస్కిన్ మాత్రం అంతటి బడ్జెట్ పెట్టాల్సిందే అని వదిలాడాడట దాంతో మిస్కిన్ ని పక్కన పెట్టి తానే డైరెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట విశాల్. డిటెక్టివ్ నేపథ్యంలో సాగే తుప్పరి వాళన్ 2 ఫస్ట్ పార్ట్ లాగే హిట్ అవుతుందా ? లేదా ? అన్నది అది పూర్తి అయి విడుదల అయితే కానీ తెలీదు.