ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఏం చేస్తున్నారో తెలుసా ?

Published on Feb 12,2020 16:58 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానుల కోసం ఏం చేస్తున్నాడో తెలుసా ....... టెంపర్ చిత్రాన్ని రేపు అనగా ఫిబ్రవరి 13 న హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐమాక్స్ లో స్పెషల్ షో వేయబోతున్నారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించిన ఈ  టెంపర్ చిత్రం 2015 లో విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రతినాయక ఛాయలున్న దయ క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించి మంచి మార్కులు కొట్టేసాడు ఎన్టీఆర్. మొత్తంగా ఎన్టీఆర్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిన టెంపర్ ని రేపు ప్రదర్శించడానికి అన్ని ఏర్పాట్లు చేసారు.

టెంపర్ ని ఇప్పుడు వేయడానికి కారణం ఏంటో తెలుసా ....... ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా కూడా గత సంవత్సరం విడుదల కాలేదు పైగా ఈ సంవత్సరం కూడా విడుదల కావడం లేదు దాంతో తన అభిమానులను ఎన్టీఆర్ రెండేళ్లు దూరం అవుతున్నాడు. అందుకే టెంపర్ తో ఓసారి పలకరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8 న విడుదల కానుంది. అప్పటి వరకు ఎన్టీఆర్ నటించిన పాత సినిమాలతోనే పలకరింపు అన్నమాట.